కావలసిన పదార్థాలు
పెసలు లేదా పొట్టు పెరసపప్పు: కప్పు
అల్లం: అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు: నాలుగు
జీలకర్ర: పావు స్పూను
పనీర్: అరకప్పు సన్న ముక్కలు
బియ్యప్పిండి: ఒక గరిటెడు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా పెసలు లేదా పెసరపప్పును బాగా కడిగి అయిదారు గంటలపాటు నానబెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకుని ఈ నానబెట్టిన పప్పులో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. తర్వాత ఆ మిశ్రమానికి జీలకర్ర, పనీర్ ముక్కలు, బియ్యప్పిండి కలిపి మళ్లీ రుబ్బుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు కలుపుకొంటే సరి. పనీర్ పెసరట్టు పోసుకోవడానికి పిండి రెడీ అయినట్టే.
పెనం మీద కాస్త నెయ్యి వేసి అట్టు పోసి దోరగా వేయిస్తే, టమాటా పచ్చడి లేదా చట్నీతో తినేందుకు పనీర్ అట్లు రెడీ అయిపోతాయి. సాధారణంగా దోశ మీద పనీర్ తురిమి వేయడం చూస్తుంటాం. అందుకు భిన్నమైన రుచితో ఈ పనీరట్టు నోరూరిస్తుంది.