జొన్నపిండి: కప్పు
గోధుమ పిండి: అరకప్పు
బియ్యప్పిండి: పావు కప్పు
పెరుగు: కప్పు
క్యాబేజీ, క్యారట్ తురుము: అరకప్పు
క్యాప్సికం: మీడియం సైజు ఒకటి
కొత్తిమీర: రెండు రెబ్బలు
పచ్చిమిరప కాయలు: మూడు
నూనె: పావు కప్పు
ఉప్పు: తగినంత
ముందుగా క్యాప్సికంను తీసుకుని సన్నగా ముక్కలు చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చి మిరపకాయల్ని కూడా బాగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ముందుగానే లెక్క ప్రకారం కొలిచి పెట్టుకున్న జొన్న, గోధుమ, బియ్యప్పిండ్లను అందులో వేయాలి. వాటితో పాటే తురిమిన క్యాబేజీ, క్యారట్లు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర పచ్చిమిర్చిలను కూడా వేయాలి.
వీటన్నింటినీ కాస్త అటూ ఇటూ కలపాలి. ఇప్పుడు పెరుగు, ఉప్పు కూడా అందులో వేయాలి. ఊతప్పం వేసేందుకు అనువుగా పిండి ఉండేలా బాగా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి, నూనె బొట్టు వేసి అరచేయంత అప్పచ్చిల్లా పిండిని వేసి కాల్చుకుంటే… మినీ వెజ్ జొన్న ఊతప్పం రెడీ అయినట్టే! ఇది తీపి ఆవకాయ కాంబినేషన్లో తినడానికి బాగుంటుంది.