నల్లబెల్లి, మార్చి 17: మండల విద్యాశాఖ అధికారిగా మేరుగుల అనురాధ (MEO Anuradha)సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నందిగామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అనురాధకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ జ్ఞానేశ్వర్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్, ఆర్. జె. డి, వరంగల్ విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు సోమవారం మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో అనురాధ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు నూతన ఎంఈవోకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలు పెంపొందించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.