మెంతికూర: కప్పు
గోధుమ పిండి: కప్పు
జీలకర్ర, ధనియాల పొడి: స్పూను
కారం: అరస్పూను
నూనె: రెండు స్పూన్లు
ఉప్పు: తగినంత
మెంతి ఆకును బాగా కడిగి సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. గోధుమ పిండిలో కాస్త ఉప్పు వేసి కొద్దిగా నూనె కూడా జోడించి పిండి కలుపుకొని పెద్ద రొట్టెలాగా పల్చగా ఒత్తుకోవాలి. దాని మీద మళ్లీ నూనె లేదా ఇష్టముంటే నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు రొట్టె మీద జీలకర్ర-ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇందాక తరిగి పెట్టుకున్న మెంతి ఆకులను రొట్టె అంతా విస్తరించేలా సమంగా చల్లాలి. చేత్తో కాస్త అదిమి, రొట్టెను గుండ్రంగా గొట్టంలాగా మలచాలి.
ఇప్పుడు దాన్ని రెండంగుళాల ముక్కలుగా కత్తిరించుకోవాలి. వాటన్నింటినీ మళ్లీ గుండ్రంగా చిన్న చిన్న రొట్టెల్లా ఒత్తుకొని, పెనం మీద కాల్చుకుంటే పొరలు పొరలుగా ఉండే మెంతి ఆకు చక్రాల రొట్టె సిద్ధమైనట్టే! దీన్ని పైన్ ఆపిల్ పచ్చడితో తింటే రుచి అదిరిపోతుంది. ఇందుకోసం పైనాపిల్‌ను సన్నని ముక్కలుగా తరుగుకొని, ఇంగువ పోపు పెట్టుకోవాలి. మగ్గాక కాస్త చింతపండు రసం, బెల్లంముక్క, రవ్వంత సాంబార్ పొడి కలిపి మగ్గనిస్తే రొట్టెలతో తినేందుకు బాగుంటుంది.