మనదేశంలో ప్రధాన ఆహారం అన్నమే! మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. వాటితో పాటు తగినంత ఫైబర్, ప్రొటీన్ కూడా తీసుకోవడం అవసరం. అప్పుడే మనం సంపూర్ణ ఆహారాన్ని తిన్నట్టు అవుతుంది. దీనికోసం సోల్ ఫుడ్‌గా పిలుచుకునే కిచిడీని సరైన ఆహారంగా చెప్పుకోవచ్చు. అన్నంతో తయారు చేసుకునే కిచిడీలో 40 గ్రాముల ప్రొటీన్, 30 గ్రాముల ఫైబర్ మనకు లభిస్తుంది. కిచిడీలో వేసుకునే కాయగూరలు మంచి ఫైబర్‌ను అందిస్తాయి.
ఇది పెద్దపేగులో లోతైన కిణ్వ ప్రక్రియకు సాయపడుతుంది. గట్ బ్యాక్టీరియాకు మేలు చేసే పదార్థాలను కిచిడీకి జోడిస్తే మరింత మేలు పొందవచ్చు. పాలకూర, అల్లం, వెల్లుల్లి కూడా ఉపయోగిస్తే మంచిది. ఇవి పాలీఫెనాల్స్, బయోయాక్టివ్ కాంపౌండ్లతో నిండి గట్ బ్యాక్టీరియా ఆరోగ్యానికి సాయపడతాయి. కిచిడీలో నెయ్యి వేయడం వల్ల కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడానికి వీలవుతుంది. మొత్తంగా రుచికరమైన కిచిడీ ఆరోగ్యకరమైనది కూడా!