WPL 2026 Auction : క్రికెట్ ఇక ఏమాత్రం జెంటిల్మన్ ఆట కాదు.. అవును ‘అబ్బాయిలేనా మేము ఆడగలం, రికార్డులు బ్రేక్ చేయగలం’ అని చాటుతున్నారు మహిళా క్రికెటర్లు. మైదానంలో బ్యాటుతో, బంతితో అదరగొట్టిన అమ్మాయిలు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. నవంబర్ 27న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మెగా వేలంలో రికార్డు ధర(రూ.3.20కోట్లు)తో దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్ర సృష్టించగా.. ప్రపంచకప్‌లో తిప్పేసిన శ్రీచరణి (Sree Charani) రూ.1.30కోట్లు పలికింది. ఇటీవల అద్భుతంగా రాణించిన పలువురు యువకెరటాలు సైతం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కోట్లు కొల్లగొట్టారు.
ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్ల కోసం మొదలైన డబ్ల్యూపీఎల్‌కు ప్రేక్షకాదరణ రెట్టింపైంది. అందుకే.. నాలుగో సీజన్ వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. మెగా ఆక్షన్‌లో వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన దీప్తి శర్మ రూ.3.20 కోట్లు పలికింది. స్టార్ ఆల్‌రౌండర్ అయిన దీప్తి కోసం ఆమె గతంలో ఆడిన యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకు రైట్ టు మ్యాచ్ ఉపయోగించుకొని దీప్తిని పట్టేసింది యూపీ. ఆల్‌రౌండర్ అయిన శిఖా పాండే(Shikha Pandey)ను రూ.2.40 కోట్లకు యూపీ దక్కించుకుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణిని రూ.1.30 కోట్లకు ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.
Experience 🤝 Class
New threads for Shikha Pandey as she joins @UPWarriorz for a whopping INR 2.4 Crore 💛💜#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/nMvcWjsfvC
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
Chinelle Henry will don the @DelhiCapitals colours 💙
The big-hitting Caribbean player goes to last year’s finalists for INR 1.3 Crore 💪#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/9bIA7mUXor
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
The stylish opening batter Phoebe Litchfield will play for @UPWarriorz 💪
An INR 1.2 Crore bid for her! 👌#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/prXdCsUUuu
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
డబ్ల్యూపీఎల్ వేలంలో ఆర్టీఎం కాకండా అత్యధిక ధర పలికిన వాళ్లలో అమేలియా కేర్(Amelia Kerr) టాప్‌లో ఉంది. రెండుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యురాలైన ఈ కివీస్ స్టార్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.3 కోట్లకు దక్కించుకుంది. భారత క్రికెటర్ల విషయానికొస్తే దీప్తి శర్మ టాప్‌లో ఉంది. శిఖా పాండేను రూ.2.40 కోట్లకు యూపీ దక్కించుకుంది.
అమేలియా కేర్ – రూ.3 కోట్లు (ముంబై ఇండియన్స్)
సోఫీ డెవినె – రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
చినెల్లె హెన్రీ – రూ.1.30 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
ఫొబే లిచ్‌ఫీల్డ్ – రూ.1.20 కోట్లు (యూపీ వారియర్స్)
లారెన్ బెల్ – రూ.90 లక్షలు (ఆర్సీబీ)
దీప్తి శర్మ – రూ.3.20 కోట్లు
శిఖా పాండే – రూ.2.40 కోట్లు
శ్రీచరణి – రూ.1.30 కోట్లు
ఆశా శోభన – రూ.1.10 కోట్లు
భారతి ఫుల్మలి – రూ.70 లక్షలు
Fierce tussle, big bid! 🔥
Starting at a base price of INR 30 lakh, Asha Sobhana goes to @UPWarriorz for INR 1.1 Crore 💜#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/DlAGTvfKuP
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025