కీరా: రెండు
జీడిపప్పు: గుప్పెడు
పచ్చిమిరపకాయ: ఒకటి
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు: రెండు
పెరుగు: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
జీడిపప్పును వేడి నీళ్లలో గంటసేపు నానబెట్టుకోవాలి. కీరాను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి సన్నటి ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. నానిన జీడిపప్పుతోపాటు రెండు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్‌లా వచ్చేందుకు కొద్దిగా నీళ్లు చిలకరించుకొంటే సరి!
ఇందులో రుచిని బట్టి మిరపకాయ… అది వద్దనుకుంటే మిరియాల పొడి (అర టీస్పూన్) వాడుకోవచ్చు. కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తినాలనుకునే ముందు కీరాముక్కల్లో ఈ కాజు పేస్ట్‌ను కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలి. చివర్లో పెరుగును కూడా జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది.