చిలగడదుంప: పెద్దవి రెండు , బ్రెడ్: ఆరు , కొత్తిమీర తరుగు: పావుకప్పు , ధనియాలు-జీలకర్ర పొడి: అరస్పూను , పచ్చిమిరపకాయలు: మూడు నిమ్మకాయ: సగం ముక్క , అల్లం: చిన్నముక్క , నెయ్యి: టీ స్పూను ,ఉప్పు: తగినంత
ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కల్లా కోసుకోవాలి. వాటిని గిన్నెలో వేసి దాన్ని కుక్కర్లో ఉంచి ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు చెక్కు తీసి మెత్తగా చిదమాలి. కొత్తిమీర పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు చిలగడదుంపల్లో ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయల తరుగుతోపాటు ధనియాలు-జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి. లేదంటే ఆమ్చూర్ పొడి (ఒక స్పూన్) కూడా వేసుకోవచ్చు. అల్లం ఫ్లేవర్ ఇష్టపడే వాళ్లు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపిన చిలగడదుంప మిశ్రమాన్ని రెండు బ్రెడ్ ైస్లెసుల మధ్య మందపాటి పూతలాగా రాయాలి. గ్రిల్ అవకాశం ఉంటే అందులో దీన్ని కాల్చుకోవచ్చు. లేదంటే పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. ఈ బ్రెడ్ బైట్లు కొత్త రుచితో తినేందుకూ సులభంగా ఉంటాయి.
– ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు