క్యాబేజీ దోశ తయారు చేయు విధానము

కావలసిన పదార్థాలు:
క్యాబేజీ తురుము: రెండు కప్పులు, బియ్యం: ఒక కప్పు, మినుపపప్పు: రెండు టేబుల్ స్పూన్లు, మెంతులు: ఒక టీ స్పూన్, ఎండుమిర్చి: నాలుగు, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, బెల్లం: పావు కప్పు, చింతపండు గుజ్జు: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: అర టీ స్పూన్, కొత్తిమీర తురుము: ఒక టీ స్పూన్, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం:
ముందుగా బియ్యం, మినుపపప్పు, మెంతులు బాగా కడిగి అందులోనే ఎండుమిర్చికూడా వేసి ఐదు గంటలపాటు నానబెట్టాలి. నానిన ఎండుమిర్చి తీసి పక్కన పెట్టి బియ్యాన్ని మెత్తగా దోశపిండిలా రుబ్బుకొని ఓ రెండు గంటలపాటు నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానిన ఎండుమిర్చి, కొబ్బరి, చింతపండు, బెల్లం, జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నానిన దోశల పిండిలో క్యాబేజీ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ప్యాన్‌మీద నూనె వేసి వేడయ్యాక దోశ వేసి, కొంచెం కాలిన తర్వాత పైనుంచి మసాలా మిశ్రమాన్ని ఒక పూతలా వేసి నూనెతో కాల్చుకుంటే వేడివేడి క్యాబేజీ దోశ రెడీ.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

