బ్రెడ్ స్లైసెస్: ఆరు, చక్కెర: ఒక కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం, జీడిపప్పు, కిస్మిస్: పావు కప్పు
బ్రెడ్ ముక్కల్ని అంచులు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనపెట్టాలి. అదే పాన్‌లో బ్రెడ్ ముక్కల్ని వేసి రెండు వైపులా తిప్పుతూ సన్నని మంటపై దోరగా కాల్చి తియ్యాలి. పాన్‌లో చక్కెర, ఒక కప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. లేతపాకం వచ్చాక బ్రెడ్ ముక్కలు, యాలకుల పొడి వేసి రెండు నిమిషాలపాటు కలపాలి. చివరగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకుంటే నోరూరించే బ్రెడ్ హల్వా సిద్ధం.