ఎండుద్రాక్ష: ఒక కప్పు
నిమ్మకాయలు: రెండు
బెల్లం: చిన్న ముక్క (ఇష్టముంటే)
ఎండు మిరపకాయలు: నాలుగైదు (పండు మిరపకాయలైనా సరే)
ఉప్పు: తగినంత
ఎండుద్రాక్షలు, ఎండు మిరపకాయలను ఒక గిన్నెలో వేసి, వేడి నీళ్లు పోసి ఒక పావు గంట నానబెట్టుకోవాలి. వీలైతే ఇక్కడ ఎండు మిరప స్థానంలో, పండు మిరపకాయలు కూడా వాడవచ్చు. అవి అయితే నానబెట్టనక్కర్లేదు. ద్రాక్ష మెత్తబడ్డాక… నీళ్లలోంచి తీసి, మిరపకాయలతో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, రెండు నిమ్మకాయల రసం పిండి కలపి మరోసారి తిప్పాలి.
ఇష్టమున్న వాళ్లు వీటితో పాటుగానే చిన్న బెల్లం ముక్కను కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ చట్నీ చపాతీలు, పరాఠాలు, దోశల్లాంటి వాటికి సూపర్ కాంబినేషన్లా ఉంటుంది. బ్రెడ్ మీద రాసుకుని తిన్నా బాగుంటుంది.