రేగొండ : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రజోత్సవ సభను విజయవంతం చేయడం కోసం నిర్వహిస్తున్న సన్నహాక సమావేశాలు గోరుకొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లె, కోనరావుపేట, గాంధీనగర్, సుల్తాన్పూర్, కొత్తపల్లె తదితర గ్రామాల్లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రజతోత్సవ సభ ద్వారా ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తెలియజేసి కనువిప్పు కలిగించడమే సభ ఉద్దేశమన్నారు. మాయమాటలతో అధికారం మీకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు. పాలన గాలికి వదిలేసి సొంత పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఈ సభ ద్వారా తెలియజేయడానికి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హమీద్, నాయకులు శ్రీనివాస్, రాజేందర్ రవి, తదితరులు పాల్గొన్నారు.