ఎగ్‌ప్లాంట్ (పెద్ద వంకాయ): ఒకటి,
టమాట: ఒకటి, పిజ్జా సాస్: అర కప్పు,
తురిమిన చీజ్: అర కప్పు, పార్సిమెన్: పావు కప్పు, ఆలివ్స్: పావు కప్పు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, కొత్తిమీర తురుము: కొద్దిగా.
ఎగ్ప్లాంట్ను కాస్త మందంగా గుండ్రటి ముక్కల్లా కోయాలి. కోసిన ముక్కల్ని ఒక ప్లేట్‌పై పరిచి పైనుంచి ఆలివ్ ఆయిల్ వేసి పదిహేను నిమిషాల పాటు 180 డిగ్రీల వద్ద ఒవెన్‌లో బేక్ చేయాలి. బేక్ అయిన ముక్కలపై పిజ్జా సాస్, చీజ్ తురుము, పార్సిమెన్ వేసి పైనుంచి ముక్కలు చేసిన ఆలివ్స్, సన్నగా, గుండ్రంగా కోసిన టమాట ముక్కలు పెట్టి మరో పదినిమిషాలు బేక్ చేయాలి. చివరగా పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా నోరూరించే ఎగ్‌ప్లాంట్ పిజ్జా సిద్ధం.