దోస గింజల గుజ్జు: ఒక కప్పు
మెంతులు: పావు స్పూను
ఆవాలు: అర స్పూను
జీలకర్ర: అర స్పూను, ఇంగువ: చిటికెడు
ఎండు మిరపకాయలు: రెండు
నూనె: టేబుల్ స్పూన్
శనగపిండి: టేబుల్ స్పూన్
బియ్యప్పిండి: 1/4 టేబుల్ స్పూన్
కారం: అర స్పూను, ఆవపిండి: పావు స్పూను
బెల్లం: చిన్న ముక్క
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఎండు మిరపకాయలు తుంచి వేసి, కొద్దిగా ఇంగువ కూడా జోడించాలి. సువాసన రాగానే దోస గింజల గుజ్జుని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత అందులో పెద్ద గ్లాసు నీళ్లు పోయాలి. ఒక చిన్న కప్పులోకి బియ్యప్పిండి, శనగపిండి తీసుకొని గంటె జారుడుగా కలిపి ఈ వేడి నీళ్లలో వేయాలి. అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. కాస్త మరిగాక కారం, ఆవపిండి కూడా వేయాలి.
పులుసులో బెల్లం వేసుకుంటే రుచి బాగుంటుంది. తీపి ఇష్టం లేని వాళ్లు దీన్ని వదిలేయొచ్చు. దోసావకాయ కారం కలుపుకొన్నప్పుడు ఆ గింజల గుజ్జు మిగిలిపోతుంటుంది. అలాగే కొందరు పులుసు, కూరలు చేసుకున్నప్పుడు కూడా గుజ్జు తీస్తుంటారు. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ఇది చక్కని ఉపాయం.