గోధుమపిండి: ఒక కప్పు, బొంబాయి రవ్వ: ఒక కప్పు
వాము: అర టీస్పూన్, కారం: అర టీస్పూన్
టమాటాలు: మూడు, ఉల్లిగడ్డలు: చిన్నవి రెండు
టమాటా సాస్: ఒక టేబుల్ స్పూన్
చక్కెర: అర టీస్పూన్ , పచ్చిమిరపకాయ: ఒకటి
వెల్లుల్లి రెబ్బలు: రెండు మూడు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు , ఉప్పు: తగినంత
నూనె : వేయించడానికి సరిపడా
ముందుగా బొంబాయి రవ్వ, గోధుమ పిండిని మిక్సీలో వేసుకొని పిండి పట్టుకోవాలి. వామును అరచేతితో నలిపి అందులో కలపాలి. ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి. ఆ ముద్దను పూరీల్లా పల్చగా ఒత్తుకోవాలి. ఇష్టాన్ని బట్టి గుండ్రగా, త్రికోణాకృతిలోనూ కత్తిరించుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి.. నూనెను వేడిచేసుకోవాలి. వీటిలో పూరీలను దోరగా వేయించుకొని తీయాలి. ఈ టార్టిల్లోస్తోపాటు తినడానికి సాల్సా తయారు చేసుకోవాలి.
ఇందుకోసం ఉల్లిగడ్డలు, టమాటాలను బాగా సన్నగా తరుక్కోవాలి. కారం కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తురిమినట్టు కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బల తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి తగినంత, ఉప్పు, కారం, కొద్దిగా పంచదారను జోడించాలి. వీటన్నిటినీ మరోసారి చాపర్లో స్మాష్ చేసినట్టుగా కచ్చాపచ్చాగా తిప్పుకొంటే.. సల్సా సిద్ధం అయిపోతుంది.