క్యాబేజీ తురుము: కప్పు
మామిడి తురుము: రెండు మూడు టేబుల్ స్పూన్లు
నూనె: మూడు టీస్పూన్లు
ఆవాలు: టీస్పూను
ధనియాలు: టీస్పూను
మెంతులు: అర టీస్పూను
ఎండు మిరపకాయలు: రెండు
ఇంగువ: చిటికెడు
పసుపు: చిటికెడు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
పచ్చిమిరపకాయలు: రెండు (ఇష్టాన్ని బట్టి)
ఉప్పు: తగినంత
కాస్త మీడియం సైజు క్యాబేజీ ముక్కను తీసుకుని ఒక కప్పు అయ్యేంత తురిమి పక్కకు పెట్టుకోవాలి. అలాగే పచ్చి మామిడి ముక్కను తీసుకుని రెండు మూడు స్పూన్ల తురుముగా చేసుకొని పక్కకు పెట్టాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో ఆవాలు, ధనియాలు, మెంతులు, ఎండు మిరపకాయలు వేసి వేగాక కాస్త ఇంగువ కూడా జోడించి దినుసులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టాలి. తర్వాత అదే నూనెలో ఇందాక పక్కన ఉంచిన క్యాబేజీ, మామిడి తురుమును వేసి, ఉప్పు, పసుపు కూడా జోడించి కాస్త మగ్గనిచ్చి పొయ్యి ఆపేయాలి.
ఈ లోపు ఇందాక చేసి పెట్టుకున్న పోపుని మిక్సీలో వేసి కాస్త బరకగా పొడిబట్టి, ఈ తురుములో వేయాలి. కావాలనుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కలిపి, చివర్లో తరిగిన కొత్తిమీరను చల్లుకుంటే ఎండకాలపు ప్రత్యేకమైన మామిడి, క్యాబేజీ పచ్చడిని పుల్లపుల్లగా లాగించేయొచ్చు!