బీట్రూట్ ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, గరం మసాలా: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, పెరుగు: ఒక కప్పు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు
బీట్రూట్ ముక్కల్ని ఒక కప్పు నీళ్లుపోసి సన్నని మంటపై పది నిమిషాలపాటు ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అన్నీ బాగా వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేయాలి. మరో రెండు నిమిషాలు వేయించాక అందులో ఉడకబెట్టి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని నీటితోపాటు వేయాలి. ఐదు నిమిషాలపాటు సన్నని మంటపై ఉడికించి దించేయాలి. చివరగా గడ్డలు లేకుండా చిలికిన పెరుగు వేసి బాగా కలిపితే నోరూరించే బీట్రూట్ కుర్మా సిద్ధం.