Harsha Sai | యూ ట్యూబర్ హర్ష సాయి తనపై లైంగిక దాడి చేయడంతోపాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ముంబైకి చెందిన ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు హర్ష సాయి (Harsha Sai)పై సెప్టెంబర్ 24న కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు హర్షసాయిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఇదిలా ఉంటే హర్షసాయి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు హర్షసాయి పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరుపనుంది. సదరు నటి హర్ష సాయితో కలిసి సినిమాలో నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించింది. అంతకు ముందు ఓటీటీ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.
పోలీసుల కథనం ప్రకారం హర్షసాయి, ఆ నటి మధ్య ఓ పార్టీలో కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని నటి ఫిర్యాదులో ఆరోపించింది. హర్షసాయి సోషల్ మీడియాలో పెద్ద బెట్టింగ్ మాఫియానే నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?