హైదరాబాద్ : క్లిష్ట పరిస్థితుల్లో కొవిడ్-19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఫ్రంట్లైన్స్లోని నర్సులందరి అసాధారణ సహకారానికి సాటిలేదని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు నేర్పించినందుకు.. మీ కరుణ, సానుభూతి, బలంతో ప్రపంచాన్ని స్వస్థత పరుస్తున్నందుకు పెద్ద కృతజ్ఞతలన్నారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ మనందరికీ సవాలుగా మారిందన్నారు. చేతులెత్తి మీ అందరిని కోరుతున్నా.. అందరం బాధ్యత వహిస్తూ, ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ లాక్డౌన్ మార్గదర్శకాలను పాటిద్దామని మహేశ్ పిలుపునిచ్చారు.
The COVID-19 second wave has been a challenging ordeal for all of us. Let's all be responsible. I urge you all to stay home and follow the lockdown protocols in our state. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) May 12, 2021