S Thaman | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం అఖండ 2 (Akhanda 2) షూట్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. బోయపాటి శీను (Boyapati srinu) డైరెక్షన్లో అఖండ్కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ (S Thaman) మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా డాకు మహారాజ్ సక్సె్స్ ఈవెంట్లో ఎస్ థమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది. అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు.. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వండి.. అయిపోండి. బోయపాటి మామూలు కసిగా లేదు. ఇంటర్వెల్‌కే మొత్తం డబ్బు ఇచ్చేయొచ్చు. సెకండాఫ్ మనకు అదనపు వినోదమన్నమాట. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం. ఆ సినిమాకు ఎలా చేయాలని ఇప్పటినుంచే చదువుకుంటున్నామంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పకీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
బాలయ్య ఆశీస్సులు తీసుకుని..
సంగీతం హిట్టయితే సినిమా సగం హట్టయినట్టే. ఈయన సినిమా హిట్టవడం కాదు.. ఎక్కడిక్కడ ఎక్కడికక్కడ ఊఫర్లు, స్పీకర్లు బ్లాస్ట్ అవుతున్నాయి. సినిమాను అర్థం చేసుకోవడం వేరు.. మామూలుగా వారి పని నిర్వర్తించడం వేరు. ఇంత కంటెంట్ ఇస్తున్నాం. మరి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందనే దానికి స్పందన జనం నుంచి కాదు.. ముందు మా నుంచి రావాలన్నాడు. పాటలే కాదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పీకర్లు, బాక్స్ బద్దలైపోయేలా బాణీలను సమకూర్చిన మా తమ్ముడికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నానని అని బాలకృష్ణ చెప్పగానే.. బాలయ్య కాళ్లకు నమస్కారం చేసి దీవెనలు అందుకున్నాడు థమన్.
ఇటీవలే యూపీలోని మహాకుంభ్‌మేళాలో షూటింగ్ మొదలు కాగా.. ఈ షెడ్యూల్‌ను పూర్తయింది. మరోవైపు బోయపాటి టీం రీసెంట్గా లొకేషన్ వేటలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించింది. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదీ తీర ప్రాంతాన్ని పరిశీలించి.. అక్కడి స్థానికులతో షూటింగ్‌కు కావాల్సిన అనుకూల పరిస్థితుల గురించి మాట్లాడింది బోయపాటి టీం. అఖండ 2ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?