టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటించిన చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. 2022 నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన యశోద బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ యశోదకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమా రీసెంట్గా టీవీలో ప్రీమియర్ అయింది.
యశోద థియేటర్, డిజిటల్ ప్లాట్‌ఫాంతోపాటు టీవీలో కూడా తన హవా చాటింది. తాజా అప్డేట్ ప్రకారం టీవీలో మొదటి ప్రీమియర్‌లోనే యశోద టీఆర్పీ 4.88గా నమోదైంది. యశోద ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. యశోద చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించారు. యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ రోల్లో నటించింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్, యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ కంపోజ్ చేసిన సన్నివేశాల్లో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది సమంత .
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్