Toxic | కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి టాక్సిక్ (Toxic). కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ తెరకెక్కిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు అదిరిపోయే వార్తను షేర్ చేశారు మేకర్స్. ప్రస్తుతం 45 రోజుల యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతోంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ పర్యవేక్షణలో ఈ షెడ్యూల్ నడుస్తోంది. ఈ షెడ్యూల్లో పాల్గొంటున్న స్టంట్మ్యాన్లు అంతా భారత్‌కు చెందిన వారే కావడం విశేషం. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌తో భారత బృందం పని చేసే అవకాశం రావడం నిజంగా అరుదైన అవకాశమనే చెప్పాలి.
టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ భామలు హ్యూమా ఖురేషి, టారా సుటారియా కీ రోల్స్‌లో నటిస్తుండగా.. అక్షయ్ ఒబెరాయ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత యశ్ కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టాక్సిక్‌లో రుక్మిణి వసంత్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారని ఇప్పటికే ఆమెకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయని వార్తలు హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tollywood | కూలీ, వార్ 2 చిత్రాలు ఆ చిన్న సినిమా ముందు తేలిపోయాయా.. ఇది కదా సక్సెస్ అంటే..
Pawan Kalyan | బాలకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..!
Chiranjeevi | మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి.. ఏపీ సీఎంని కలిసి మరి..