Yash | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే యష్ బర్త్‌డే పీక్ అంటూ గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నయనతారతో పాటు బాలీవుడ్ నటి కియార అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే కియార గర్భవతి కావడంతో.. తాను చేస్తున్న అన్ని సినిమాల షూటింగ్‌లను వరుసుగా కంప్లీట్‌గా చేసుకుంది ఈ భామ.. భవిష్యత్తులో కూడా ఏ ప్రాజెక్ట్‌ను ఒకే చేయలేదు.
అయితే కియార గర్భవతి కావడంతో..‘టాక్సిక్’ సినిమాలో తన పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తవ్వడం కోసం యష్ తన లోకేషన్‌ని బెంగళూరు నుంచి ముంబైకి షిఫ్ట్ చేసుకున్నడంటా.. దీంతో మేకర్స్ కియారా – యష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలను త్వరగా షూట్ చేసి కంప్లీట్ చేసినట్లు శాండల్‌వుడ్ మీడియా చెప్పుకోచ్చింది. అయితే ఒక నటి కోసం తన షూటింగ్ లోకేషన్నే మార్చిన యష్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Read More