Kajol | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సౌత్ లో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. కాకపోతే కాజోల్ నటించిన హిందీ చిత్రాలు తెలుగులో డబ్ అయి దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఆమెకి మంచి గుర్తింపు వచ్చేలా చేశాయి. 1992 నుంచి కాజోల్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చింది.స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ సరసన ఎక్కువ సినిమాలు చేసింది. షారుఖ్ ఖాన్ – కాజోల్ ఆన్ స్క్రీన్ పెయిర్ కు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన బాజీగర్, డూప్లికేట్, దిల్ వాలే దుల్హానియా లే జాయేగి, కుచ్ కుచ్ హోతా హ, కబీ ఖుషి కబీ గమ్, కహో నా హో, రబ్ నే బనాది జోడి వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.
దక్షిణాది ప్రేక్షకులను ‘మెరుపు కలల’ అనే చిత్రంతో పలకరించింది. ఇందులో అరవింద్ స్వామి, ప్రభు దేవాలతో కలిసి నటించింది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ధనుష్ ‘రఘువరన్ బీటెక్ 2’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోను కాజోల్ అదరగొడుతుంది. త్వరలో మా అనే సినిమాతో పలకరించనుంది .జూన్ 24 ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుండగా, ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ గురించి ఆసక్తికర కామెంట్ చేసింది కాజోల్. అదొక భయంకర ప్రదేశమని జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదు అని చెప్పుకొచ్చింది.
తాను నటించిన ఓ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగ్గా.. ఆ సమయంలో తాను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నానని కాజోల్ చెప్పుకొచ్చారు. కొన్ని ప్రదేశాలు భయపెట్టాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారు. జీవితంలోమరోసారి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లాలనుకోలేదని ఆమె అన్నారు. అంతే కాదు.. రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా వర్ణిస్తూ కామెంట్ చేసింది కాజోల్. మరి కాజోల్ ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటది మాత్రం రివీల్ చేయలేదు. కాగా, ఇక కాజోల్ అజయ్ దేవగణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
“I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.
Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world.”
– Bollywood Actress #Kajol
pic.twitter.com/S9AQcJnweK— Whynot Cinemas (@whynotcinemass_) June 17, 2025