Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వరుస సినిమాలొస్తున్నాయని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ క్రేజీ సినిమా సూర్య 44 (Suriya 44). స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కాగా సినిమా నుంచి మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న క్రేజీ వార్త రానే వచ్చింది. సూర్య 44 టైటిల్ టీజర్‌ను క్రిస్మస్ కానుకగా రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ లుక్ షేర్ చేశారు.
సముద్రతీరాన బెంచ్‌పై పూజాహెగ్డే కూర్చొని ఉండగా.. పక్కనే సముద్రంవైపు గులకరాళ్లు విసురుతుండటం చూడొచ్చు. క్రిస్మస్ కానుకగా గట్టిగానే ప్లాన్ చేశాడని ప్లాన్ చేశాడని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రానికి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఈ పాటను గోవాలో వేసిన స్పెషల్ సెట్లో చిత్రీకరించినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం.యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ప్రేమ కథ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
The One’s Xmass Gift 🎁
Get ready for the #Suriya44 Title Teaser 🔥 Tomorrow, 25th Dec at 11 AM #LoveLaughterWar #TheOneXmass @Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art #MayaPandi @JaikaStunts… pic.twitter.com/oExsViuC69
— 2D Entertainment (@2D_ENTPVTLTD) December 24, 2024
Max Trailer | ప్రతీ పకోడిగాడు సమాజ సేవకుడే.. స్టన్నింగ్‌గా కిచ్చా సుదీప్ మాక్స్ ట్రైలర్
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్