Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కూలీ (Coolie). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్.
ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ అందుకున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. గత రెండు దశాబ్ధాల్లో సీబీఎఫ్సీ నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్న రజినీకాంత్ సినిమా కూలీ కావడం విశేషం. తాజాగా ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ రన్‌టైంపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కూలీ రన్ టైం 170 నిమిషాలు.. అంటే 2 గంటల 50 నిమిషాలు. మరి ఈ లెంగ్తీ రన్‌టైం పూర్తయ్యేవరకు సీట్లకు అతుక్కుపోతారా..? లేదా..? అనేది ఆగస్టు 14న స్పష్టత రానుంది.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్ండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Rajinikanth: ఫిల్మ్ కెరీర్‌కు 50 ఏళ్లు.. 5500 ఫోటోలతో రజినీకాంత్ గుడిలో అలంకరణ, అభిషేకం