చెన్నై: తలైవా రజనీకాంత్(Rajinikanth) సినీరంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు గడిచింది. సూపర్‌స్టార్ రజినీ ఫిల్మ్ కెరీర్ 50 ఏళ్ల మైలురాయి అందుకున్న నేపథ్యంలో అతని అభిమాని ప్రత్యేక పూజలు చేశాడు. మధురైలో ఉన్న రజినీకాంత్ గుడిలో అభిషేకం కూడా నిర్వహించాడు. ఆ ఆలయాన్ని సుమారు 5500 ఫోటోలతో అలంకరించాడు. రజినీకాంత్ టెంపుల్లో సుమారు 300 కిలోల బరువైన రజినీ విగ్రహం ఉన్నది.
కార్తీక్ అనే వ్యక్తి.. రజినీకి వీరాభిమాని. అతని ఫ్యామిలీ కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నది. రజినీకాంత్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేపథ్యంలో.. ప్రత్యేక పూజలు చేశారు. రజినీ నటించిన చిత్రాల్లోని ఫోటోలను ఆ గుడిలో అలంకరించారు. 1975లో రజినీ తన ఫిల్మ్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. 74 ఏళ్లు ఉన్న రజినీ తమిళ సిని ఇండస్ట్రీలో ప్రఖ్యాత నటుడిగా కొనసాగుతున్నారు.
అపూర్వ రాగంగల్ చిత్రంతో రజినీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు. కే బాలచందర్ దాన్ని డైరెక్ట్ చేశారు. రజినీ నటించిన తాజా చిత్రం కూలీ ఈనెల 14వ తేదీన రిలీజ్ కానున్నది.