Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టైన విషయం తెలిసిందే. గత శుక్రవారం అరెస్ట్ కాగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా ఈ బెయిల్ రద్దు కానుందా..? అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు రౌండప్ చేస్తున్నాయి. బెయిల్ రద్దు చేసే విషయంపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారట. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేం లేదని, పోలీసులే ఫెయిల్ అయ్యారంటూ ఓ వైపు చర్చ నడుస్తుండగా.. సంధ్య థియేటర్ విజిట్‌కు వెళ్లేందుకు అల్లు అర్జున్ టీంకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది.
ఈ నేపథ్యంలో.. పోలీసులు ఇదే రిపోర్ట్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఏదైనా ప్రకటన వస్తే క్లారిటీ రానుంది.
ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు..
జైలు నుంచి విడుదలైన సందర్భంగా బన్నీ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని.. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నాడు. ఆ కుటుంబానికి మరోసారి నా క్షమాపణలతో పాటు సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నాడు.
Dacoit | అవును వదిలేసాను కానీ అంటున్న మృణాల్ ఠాకూర్.. అడివి శేష్ డెకాయిట్ లుక్ వైరల్
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Suman | హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్