బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 23:49:20

‘వైల్డ్‌ డాగ్‌' సెట్స్‌లో అడుగుపెట్టిన నాగార్జున

‘వైల్డ్‌ డాగ్‌' సెట్స్‌లో అడుగుపెట్టిన నాగార్జున

కరోనా విజృంభణతో గత ఆరునెలలుగా షూటింగ్‌లకు బ్రేక్‌పడింది. నిత్యం తారల వెలుగుజిలుగులు, సినీ కార్మికుల కోలాహలంతో ఓ ఉత్సవాన్ని తలపించే సినిమా సెట్స్‌ మౌనం దాల్చాయి.  ఇటీవల కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి షూటింగ్‌ల సందడి మొదలైంది. అయితే ఇప్పటివరకు అగ్ర కథానాయకులెవరూ చిత్రీకరణలో పాల్గొనలేదు. అందుకు నాగార్జున తొలి అడుగు వేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌' సెట్స్‌లోకి అడుగుపెట్టారు. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దియామీర్జా, సయామీఖేర్‌ కథానాయికలు. డబ్బుశైతం చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్‌ పునఃప్రారంభం సందర్భంగా నాగార్జున ఆన్‌సెట్స్‌ ఫొటోల్ని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ‘వైల్డ్‌ డాగ్‌' చిత్రంలో నాగార్జున విజయ్‌వర్మ అనే ఎన్‌.ఐ.ఏ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. రచన-దర్శకత్వం: అహిషోర్‌ సోల్మన్‌.logo