వకీల్ సాబ్ ప్రివ్యూ | ఆకాశమంత అంచనాలు మోసుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. ఈయన మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనిపై అంచనాలు ఎలా ఉన్నాయి అని అడగకూడదు.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా అంచనాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక వకీల్ సాబ్ ప్రివ్యూ ఎందుకు చూడాలనే దానికి 5 ప్రధాన కారణాలు ఇప్పుడు చూద్దాం..
అఫ్ కోర్స్.. సినిమాలో పవన్ హీరో అయినప్పుడు కారణం అవసరం లేదు. ఆ సినిమా చూడడానికి ప్రధాన కారణం ఆయనే అవుతాడు. అభిమానులకు ఆయన స్క్రీన్ పై చూడడం కంటే పండగ మరొకటి లేదు. వకీల్ సాబ్ ఈ విషయంలో కూడా మొదటి కారణం ఆయనే.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా హీరో మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. జనసేన పార్టీ స్థాపించి జనాల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడు జనసేనాని. ఇలాంటి సందర్భంలో సినిమా చేసేటప్పుడు కథ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాలో కూడా సందేశం ఇస్తున్నాడు. అమ్మాయిల స్వేచ్ఛ ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది.
ఒకటి రెండు కాదు 22 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని కలలు కంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇన్నాళ్లకు ఆ అవకాశం వచ్చింది. అందుకే ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణాల్లో దిల్ రాజు కూడా ఒకరు.
తన కెరీర్లో ఏ హీరోయిన్ కు కూడా మూడుసార్లు తనతో నటించే అవకాశం ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. కానీ తొలిసారి శృతిహాసన్‌తో మూడోసారి జోడి కట్టాడు. ఈ కాంబినేషన్ కూడా వకీల్ సాబ్ సినిమా చూడడానికి ఒక కారణం. గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించారు.
నిజానికి పింక్ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన ఈ సినిమాలో 5 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు పెరగడం లో యాక్షన్ పార్ట్ కూడా ప్రధాన కారణం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి