ఫహద్ ఫాసిల్..భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడు. మలయాళంలో స్టార్ ఇమేజ్ కొనసాగిస్తూనే..ఇతర భాషల్లో తానెంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే సూపర్ డీలక్స్ చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఫహద్..ఈ ఏడాది తెలుగులో అల్లు అర్జున్ హీరో గా నటిస్తోన్న పుష్పతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.
ఫహద్ పాసిల్ ఇపుడు మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎందుకంటే ఫహద్ పాసిల్ ఈ సారి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌తో నటించబోతున్నాడు. కమల్ హాసన్ లీడ్ రోల్ చేస్తున్న విక్రమ్‌లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఫహద్ పాసిల్. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు ఫహద్.