పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ : 50 నిమిషాలు.. 50 కోట్లు..
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ | రెండున్నర గంటల నిడివి ఉన్న వకీల్ సాబ్సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించేది కేవలం 52 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది.

ఇంకా ఒక్కరోజు.. ఒక్కరోజు ఓపిక పడితే చాలు పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్‌పై దండెత్తడానికి వచ్చేస్తాడు. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా వకీల్ సాబ్ పేరు తప్ప మరోటి వినిపించడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో పవన్ మేనియా నడుస్తుంది ఇప్పుడు. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి నాన్‌స్టాప్ చర్చ జరుగుతూనే ఉంది. అసలు పవన్ ఇమేజ్ గురించి చెప్పాలంటే రోజులు పడుతుందేమో..? చేసిన సినిమాల్లో సగం ఫ్లాపులే ఉంటాయి కానీ ఈయనంటే ఎందుకో తెలియదు అభిమానులకు తెలియని పిచ్చి పట్టుకుంది. పవన్ సినిమా వస్తుందంటే అదేంటో పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ చూస్తుంటే రికార్డులు ఏవీ మిగిలేలా కనిపించడం లేదు. మరోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అవుతుంది.

పింక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు.. అలాంటి సబ్జెక్ట్ పవన్‌తో ఎలా వర్కౌట్ అవుతుంది అని చాలామంది ప్రశ్నించారు. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ చెప్పాడు. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ దాదాపు ఏడాది పాటు కష్టపడి పింక్ సినిమా కథను పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా మార్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వకీల్ సాబ్. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఉంటాడు అనే విషయం మాత్రం చాలా మందిని టెన్షన్ పెడుతుంది. దీనికి సమాధానం ఇప్పుడు బయటకు వచ్చింది. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించేది కేవలం 52 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది.

ఈ సినిమాలో నటించడానికి రూ.50 కోట్లను పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే నిమిషానికి కోటి రూపాయిలు అన్నమాట. 50 నిమిషాలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నాడు పవర్ స్టార్. అది ఆయన రేంజ్.. ఆయన ఉన్నందుకే సినిమా బిజినెస్ కూడా రూ.120 కోట్లు దాటిపోయింది. సినిమాలో కొత్త పెళ్లి కొడుకు మాదిరి పవన్ కళ్యాణ్‌ను అప్పుడప్పుడు చూపిస్తూ వస్తారని తెలుస్తోంది. అందులోనే శృతి హాసన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఏదేమైనా కూడా రెండున్నర గంటల సినిమాలో పవన్ గంటసేపు కూడా కనిపించడని తెలిసిన తర్వాత అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆరేళ్ల కింద వెంకటేష్ హీరోగా వచ్చిన గోపాల గోపాల సినిమాలోనూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్ర చేశాడు. అందులో కూడా 40 నిమిషాలు కనిపించే పాత్రలో మెరిశాడు. ఏదేమైనా ఇంత తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేసి కూడా 50 కోట్ల రెమ్యునరేషన్ అంటే పవన్ కళ్యాణ్ నువ్వు సూపర్ అంతే..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి
చెడ్డీలోనే పెండ్లికొడుకు..షాకైన జనం
బాలీవుడ్ నటి జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోలు
Actress Vishnupriya లేటెస్ట్ ఫోటోలు
‘పుష్ప’ రిలీజ్ అన్ని నెలలు వాయిదా పడబోతుందా.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
అమెజాన్ ప్రైమ్‌లో జాతిరత్నాలు .. ఎప్పుడంటే..?
కమల్‌హాసన్ సినిమాలో ఫహద్ ఫాసిల్..!
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

