Rashmika Mandanna | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్‌గానే కాకుండా వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని తెలిసిందే. మే 27న ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రష్మిక హాజరైంది. ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ యాంకర్‌గా మారి రష్మికను కొన్ని ప్రశ్నలు వేశాడు.
రష్మిక పక్కనే కూర్చున్న ఆనంద్ దేవర కొండ మీ ఫేవరేట్ కోస్టార్ ఎవరని అడిగాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ప్రేక్షకులంతా రౌడీ బాయ్ అంటూ అరుపులు, కేకలు వేశారు. దీంతో రష్మిక కొంచెం కోపంతో నవ్వుతూ.. ఆనంద్ మీరు నా కుటుంబం. ఇలా నన్ను స్పాట్లో పెట్టేస్తే ఎట్లా అని అడిగింది. ఇక అభిమానుల కేరింతల మధ్య ఫైనల్‌గా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేరు చెప్పడంతో ఈవెంట్ అంతా దద్దరిల్లి్పోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
విజయ్, రష్మిక మూడోసారి కలిసి నటించబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తుండగా.. దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
#Anand : who’s your Fav co-star?#RashmikaMandanna – RowdyBoy (vijaydevarakonda) pic.twitter.com/Xv0XpXSe1q
— Filmy Bowl (@FilmyBowl) May 27, 2024