శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 09:22:44

సీజ‌న్ 4 మొద‌టి ఫైన‌లిస్ట్ ఎవ‌రంటే ?

సీజ‌న్ 4 మొద‌టి ఫైన‌లిస్ట్ ఎవ‌రంటే ?

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో టిక్కెట్ టూ ఫినాలే మెడ‌ల్‌కి సంబంధించిన టాస్క్ గ‌త మూడు రోజులుగా జ‌రుగుతూ వ‌స్తుండ‌గా, అది శుక్ర‌వారం ముగిసింది. చివ‌రి రౌండ్లో అఖిల్‌, సోహైల్ పోటి ప‌డ‌గా ఆ మెడ‌ల్‌ని అఖిల్ ఎగరేసుకుపోయాడు. 'టికెట్ టు ఫినాలే' రేస్‌లో భాగంగా సోహైల్‌, అఖిల్ దాదాపు 24 గంట‌లు పైగానే ఉయ్యాల‌పై గ‌డిపారు. వారిద్ద‌రికి అన్నీ ఉయ్యాలే అయింది. ఇక వీరి మొండిప‌ట్టు చూసి సంచాల‌కుడిగా ఉన్న అభిజీత్ మీరిద్ద‌రు ఏదో ఇక‌టి డిసైడ్ చేసుకోండ‌ని స‌ల‌హా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎవ‌రు ఉండాలి, ఎవ‌రు దిగాలి అని డిసైడ్ చేసుకున్నారు.

ఎప్ప‌టిలాగానే అఖిల్ ఎమోష‌న‌ల్ గేమ్ ఆడాడు. ఈ గేమ్ ఇద్ద‌రికి అవ‌స‌రం. మా అమ్మ కెప్టెన్ అవ్వ‌మ‌ని అడ‌గిన నేనే కాలేక‌పోయాను. టాప్ 5లో మాత్రం ఉంటాన‌ని అమ్మ‌కు చెప్పా. అన్న వ‌చ్చి కూడా నన్ను టాప్ 5లో ఉంచ‌లేదు. దీంతో నాకు చాలా భ‌యంగా ఉంది అన‌డంతో సోహైల్‌.. ఉయ్యాల దిగేందుకు సిద్దమయ్యాడు. కానీ అఖిల్‌ అడ్డుకున్నాడు. ప‌ర్లేదు నీ కోసం దిగుతా అని సోహైల్ చెప్పాడు. మ‌న ఇద్ద‌రం మొండోళ్ళం. ఉడుం ప‌ట్టు ప‌ట్టిన‌ట్టు కూర్చుంటాం. ఇలానే ఉంటే ఇద్ద‌రికి కాకుండా పోత‌ది అని సోహైల్ అన్నాడు

అఖిల్ మాట్లాడుతూ.. ఈ వారం నేను నామినేష‌న్‌లో ఉన్నాను. ఒక‌వేళ నేను ఎలిమినేట్ అయితే ఇది వృధా అవుతుంది. అందుకే ఆ టికెట్ నువ్వే తీసుకో. న‌న్ను ఉయ్యాల నుండి తోసేయ్ అని అఖిల్ అన్నాడు . అనంతరం సోహైల్.. న‌న్ను ఇంట్లో బాగా చూసుకున్నావ్ . త‌మ్ముడి క‌న్నా బాగా చూసుకున్నావ్ అంటూ సోహైల్ ఎమోష‌న‌ల్ కాగా, అఖిల్ కూడా అత‌డిని ప‌ట్టుకొని ఏడ్చేశాడు.ఇక చివ‌రికి ఏం చేయ‌లేక సోహైల్ ఉయ్యాల నుండి దిగేశాడు. ఆ త‌ర్వాత అభిజీత్‌ని హ‌త్తుకొని అఖిల్, సోహైల్‌లు వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఈ టాస్క్ విజ‌యంతో బిగ్ బాస్ సీజన్ 4లో మొద‌టి ఫైన‌లిస్ట్‌గా అఖిల్ ఎంపిక‌య్యాడు.ఈ వారం ఎలిమినేష‌న్ నుండి అఖిల్ సేవ్ అయితే డైరెక్ట్‌గా ఫినాలేకు వెళ‌తార‌ని చెప్పుకొచ్చారు బిగ్ బాస్.


logo