సునీల్ ‘అందాల రాముడు’ ముందుగా ఎవరు చేయాల్సిందో తెలుసా..?
చాలా సినిమాలకు ముందు అనుకున్న హీరోలను కాకుండా మరో హీరోలను తీసుకుంటారు. అలా మారిపోయిన స్క్రిప్టులు.. సినిమాలు బోలెడుంటాయి.

చాలా సినిమాలకు ముందు అనుకున్న హీరోలను కాకుండా మరో హీరోలను తీసుకుంటారు. అలా మారిపోయిన స్క్రిప్టులు.. సినిమాలు బోలెడుంటాయి. అందులో కొన్ని మరో హీరోలకు వెళ్లి సంచలన విజయం సాధిస్తుంటాయి కూడా. అలా ఎవరో అనుకున్న సినిమాలో సునీల్ వచ్చి విజయం అందుకున్నాడు. ఆ సినిమా అందాల రాముడు. 15 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు కమెడియన్ గా ఉన్న సునీల్ కాస్తా ఈ సినిమాతో హీరో అయ్యాడు. అలీ, బ్రహ్మానందం లాంటి కమెడియన్లు కూడా హీరోలుగా నటించారు కానీ ఎక్కువ కాలం స్టార్స్ గా నిలవడలేకపోయారు. అలాంటి సమయంలో సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. 2006లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే 12 కోట్ల షేర్ వసూలు చేసింది.
కమెడియన్‌గా ఉన్న సునీల్ అందాల రాముడు సినిమాతో హీరో అయిపోయాడు. డాన్సులు, కామెడీ, ఎమోషన్స్ తో పిచ్చెక్కించాడు. లక్ష్మీనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆర్బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2006లో విడుదలైన అందాల రాముడు సినిమాతో సునీల్ కెరీర్ మారిపోయింది. అయితే ఈ చిత్రంలో ముందు హీరో ఈయన కాదు. సునీల్ కాకుండా మరో హీరోను అనుకున్నారు. 1996లో లివింగ్ స్టన్, రంభ జంటగా వచ్చిన సుందర పురుషన్ సినిమాకు రీమేక్ అందాల రాముడు. అప్పట్లో సినిమా సంచలన విజయం సాధించింది.
అదే సమయంలో తెలుగులో ఈ సినిమాను సీనియర్ నటుడు బ్రహ్మాజీ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కృష్ణవంశీతో సిందూరం సినిమా చేస్తున్న సమయంలోనే బ్రహ్మాజీ దగ్గరికి సుందర పురుషన్ రీమేక్ ఆఫర్ వచ్చింది. అయితే అలాంటి సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్న సమయంలో కామెడీ సినిమా చేయడం ఇష్టం లేని బ్రహ్మాజీ.. సుందర పురుషన్ రీమేక్‌కు నో చెప్పాడు. సిందూరం తర్వాత చేద్దామనుకున్నా దర్శక నిర్మాతలు మళ్లీ కలవలేదు. పదేళ్ల తర్వాత సుందర పురుషన్ సినిమాను సునీల్ హీరోగా అందాల రాముడు పేరుతో రీమేక్ చేసారు. ఏదేమైనా కూడా బ్రహ్మాజీ మిస్ అయిన సినిమా సునీల్ కు విజయం అందించింది.
ఇవి కూడా చదవండి..
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

