Chiranjeevi | చిరంజీవి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. చిరంజీవితో సినిమా చేసేందుకు పూరీ రెండు మూడు సార్లు ప్రయత్నించారు. కానీ కథ వర్కౌట్ కాకపోవడంతో కాంబినేషన్ పట్టాలెక్కలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమోనని ఇప్పటికీ ఫ్యాన్స్ ఆశతోనే ఉన్నారు. చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజకీయాలకు దూరం అయిపోయిన తర్వాత.. సినిమా హీరోగా మామూలుగా బిజీ అవ్వట్లేదు మెగాస్టార్. ఈయన కోసం కథలు రాస్తున్న ప్రతి దర్శకుడికి ఆఫర్ ఇచ్చేస్తున్నాడు.. అలాగే తన కోసం కథలు రాయాలంటూ కుర్ర దర్శకులను కూడా అడిగేస్తున్నాడు అన్నయ్య. మెహర్ రమేశ్‌తో భోళా శంకర్ సినిమా పూర్తి కావడంతో ప్రస్తుతం కుటుంబంతో పాటు ఫారెన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్.
ఇండియాకు రాగానే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా.. అలాగే వశిష్టతో మరో సినిమా చేయడానికి కమిటయ్యాడు మెగాస్టార్. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పూరీ జగన్నాథ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. నిజానికి పూరి చెప్పిన కథ చిరంజీవికి నచ్చింది. అయితే అప్పటికే రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి కమిట్ అవ్వడంతో.. తన రెండు సినిమాలు పూర్తయిన తర్వాత పూరితో సినిమా చేయడానికి మెగాస్టార్ ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ లెక్కన సమ్మర్ 2024 తర్వాత చిరంజీవి పూరీ జగన్నాథ్ సినిమా సెట్స్ పైకి రావడం దాదాపు ఖాయమైపోయినట్టే.
ఆ మధ్య పూరీతో ఇన్‌స్టా లైవ్ చేశాడు చిరు. దాదాపు గంట సేపు సాగిన ఈ డిస్కషన్లో చివరగా పూరీని చిరు అడిగిన ప్రశ్న.. నా ఆటోజానీ ఉందా లేదంటే తీసి పక్కన పడేసావా..? అని. దీనికి పూరీ కూడా ఆన్సర్ ఇచ్చాడు. లేదు సర్.. ఆ సినిమా పక్కన బెట్టేసాను.. మీ కోసం మరో మంచి కథ రాస్తాను అని చెప్పుకొచ్చాడు. అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ తో ఆటో జానీ సినిమా అనౌన్స్ చేసి ఆపేశాడు చిరంజీవి. సెకండాఫ్ నచ్చక సినిమా వదిలేశాడు మెగాస్టార్. ఆ తర్వాత పూరీ కూడా ఆటో జానీ గురించి ఆలోచించలేదు. తన పని తాను చేసుకుంటున్నాడు. చిరంజీవి కూడా ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆటోజానీని అటకెక్కించారు. మళ్లీ ఇప్పుడు ఆ సినిమా గురించి ఆరా తీశాడు చిరు. దానికి పూరీ ఇచ్చిన జవాబుతో ఆటో జానీ పూర్తిగా అంతం అయిపోయిందని అర్థమైపోయింది. ఆ కథ పూర్తిగా పాతదైపోయిందని.. ఇప్పుడు అది వర్కవుట్ అవ్వదని పూరీనే తేల్చేశాడు. అందుకే చిరంజీవి కోసం మరో కథ రాస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి త్వరలోనే ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావడం అయితే పక్కా.!
“Chiranjeevi | ఆ విషయంలో చిరంజీవి నో కాంప్రమైజ్ అంటున్నాడుగా..!”