Ranbir Kapoor | రీమేక్ సినిమాల పట్ల తన అయిష్టాన్ని వ్యక్తం చేశారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మళ్లీ పునర్నిర్మించడంలో అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రీమేక్ చిత్రాల ట్రెండ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రణ్‌బీర్ మాట్లాడుతూ…‘రీమేక్ చిత్రాలకు, పాటలకు నేను వ్యతిరేకం.
ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించడం ఏ కొత్తదనం పంచదు. ఒక కథను సాధ్యమైనంత సృజనాత్మకంగా రూపొందించిన తర్వాత మరోసారి ఆ కథలో ఆకట్టుకునే అంశం ఏముంటుంది. హీరోగా ఒక కొత్త కథను ప్రేక్షకుల దగ్గరకు తీసుకొచ్చే స్థాయిలో నేనున్నాను. అదే ప్రయత్నాన్ని చేస్తా. నా కెరీర్ తొలినాళ్లలో ‘బచ్నా ఏ హసీనో’ చిత్రంలో ఓ పాటను రీమిక్స్ చేశాను. అప్పుడు దర్శకులకు వద్దని చెప్పేంత ధైర్యం నాలో ఉండేది కాదు’ అని చెప్పారు.