శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్‌రెడ్డి దర్శకుడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ పతాకంపై శ్రీనందు, శ్యామ్‌సుందర్ రెడ్డి తుడి నిర్మిస్తున్నారు. శనివారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని హైపరాక్టివ్‌గా స్పందించే ఓ యువకుడు, అతని స్నేహితుల కారు ప్రయాణం నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
తాను ఓ పరాజితుడినని చెప్పుకునే హీరోకు మిత్రులు ధైర్యాన్ని అందించడం ఈ క్రమంలో జరిగిన సంఘటనతో టీజర్ ఆకట్టుకుంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నానని, హీరో నందు పాత్రతో చాలా మంది యూత్ కనెక్ట్ అవుతారని, హైదరాబాద్ యాస సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.ప్రకాష్ రెడ్డి, సంగీతం: స్మరణ్, రచన-దర్శకత్వం: వరుణ్ రెడ్డి.