Dil Raju | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sreetej)ను ఇవాళ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju), నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి పరామర్శించారు. కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ కోరాం. ఇవాళ ఉదయమే అపాయింట్మెంట్పై స్పష్టత వచ్చింది. నటులు, నిర్మాతలు, డైరెక్టర్లతో రేపు ఉదయం 10 గంటలకు సీఎంను కలుస్తామన్నారు. ఎఫ్డీసీ తరపున ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలని సీఎం అడిగారు. ఈ నేపథ్యంలో పోలీస్ టవర్స్‌లో సీఎంతో సమావేశమవుతామని దిల్ రాజు తెలిపారు.
Allu Aravind | శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం : అల్లు అరవింద్
Dil Raju | కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ