బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. వచ్చే నెల 12న సినిమా విడుదల కానుంది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. మిస్టీరియస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా టీజర్ సాగింది.
పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. ఇంతలో రేడియో ఒక మెసేజ్ ప్రసారం చేస్తుంది. మొత్తంగా ఈ టీజర్ పారానార్మల్ ఎనర్జీతోపాటు డిఫరెంట్ టైమ్ లైన్స్‌ని ప్రజెంట్ చేసింది. హీరోహీరోయిన్ల పాత్రలు కూడా టీజర్లో ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సమర్పణ: అర్చన, నిర్మాణం: షైన్ స్క్రీన్స్.