Hari Hara Veera Mallu | సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. తాజా అప్డేట్తో ఇది నిజమేనని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మొదలు కానుంది.
కొత్త షెడ్యూల్ ఎపిక్ వార్ సీక్వెన్స్‌తో మొదలు కానుందని తెలియజేశారు మేకర్స్. ఇంతకీ షూటింగ్ ఏ రోజు షురూ అవుతుంది.. మరి పవన్ కల్యాణ్ ఎప్పుడు షూట్లో జాయిన్ అవుతాడనేది క్లారిటీ రావాల్సి ఉంది. హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్‌కు స్వాగతం పలుకుతూ ఇటీవలే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పవన్ కల్యాణ్ మరోవైపు సుజిత్ దర్శకత్వంలో ఓజీ (They Call Him OG), హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నాడని తెలిసిందే. వీటికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
PowerStar PawanKalyan @PawanKalyan #HariHaraVeeraMallu Team Begins Shoot With Epic War Sequence . pic.twitter.com/crZvo68kyW
— BA Raju’s Team (@baraju_SuperHit) August 16, 2024
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Nani | ఓజీ డైరెక్టర్ సుజిత్ సినిమాకు బ్రేక్ పడిందా..? నాని క్లారిటీ
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలోకి శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఎంట్రీ..!