WAR 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘వార్ 2 చిత్రంతో హిందీ చలన చిత్రసీమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ వలన ఈ సినిమాకి సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ రాగా, నార్త్‌లో హృతిక్ రోషన్ వలన వచ్చింది. దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే అందరి కంటే నాగ వంశీ ఒక అడుగు ముందుకి వేసి రైట్స్ దక్కించుకున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన ఎస్. నాగవంశీ ఈ సినిమా తెలుగు హక్కులను రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇది ఈ మధ్య కాలంలో ఒక హిందీ సినిమా తెలుగు రైట్స్‌కు దక్కిన అత్యధిక ధరగానే చెప్పాలి. సౌత్ మార్కెట్‌పై బాలీవుడ్ నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని ఇది మరోసారి రుజువు చేస్తోంది. ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులు రూ.50 కోట్లు పలికినట్టు సమాచారం. ఈ రెండు భారీ సినిమాలకి ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర గట్టి ఫైటే ఉంటుంది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరగా, ప్రమోషన్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ ఫ్రాంచైజీలో క్రేజీ ప్రాజెక్ట్‌గా ‘వార్-2’ రూపొందుతుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ స్పై క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం.