మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి స్టన్నింగ్ సాంగ్ అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య నుంచి మెగామాస్ సాంగ్ పూనకాలు పాటకు సంబంధించిన అప్డేట్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ పూనకాలు (Poonakaalu) లోడింగ్.. అంటూ ఈ పాటను డిసెంబర్ 30 (రేపు)న లాంఛ్ చేయబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.
చిరంజీవి, రవితేజ మాస్ బీట్తో ఇరగదీయబోతున్నట్టు తాజా పోస్టర్ చెబుతోంది. ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పాటను లాంఛ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ స్పెషల్ సాంగ్‌లో మెరువబోతుంది. వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.
Yo boys and girls, time to switch on the MEGA MASS mode 🔥🕺🏾
MEGASTAR × MASS MAHARAJA = #PoonakaaluLoading ❤️🔥
Song out tomorrow 💥#WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/R6qu10f9a3
— BA Raju's Team (@baraju_SuperHit) December 29, 2022
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!
Read Also : Dhamki | ధమ్కీలో ఆర్పీ పట్నాయక్ పాట.. విశ్వక్సేన్ అప్డేట్
Read Also :Dil Raju | జూనియర్ ఎన్టీఆర్‌తో వన్స్‌మోర్.. దిల్ రాజు క్లారిటీ