Allari Naresh | రవితేజ నటించిన ధమాకా సినిమాకు కథనందించాడు యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar ). ఈ టాలెంటెడ్ రైటర్ త్వరలోనే దర్శకుడిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna )తో సినిమా చేయబోతున్నాడు ప్రసన్న కుమార్.
కాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. హీరో నరేశ్ (Allari Naresh) ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రసన్నకుమార్-నాగార్జున ప్రాజెక్ట్ పనులు చివరి దశలో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఎంటర్టైనింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జున రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ ఏడాది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సారి ప్రసన్నకుమార్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు నాగ్.