టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) త్వరలోనే అందరికీ ధమ్కీ (Dhamki) ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. కాగా ధమ్కీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ ఆర్పీ పట్నాయక్ ధమ్కీలో ఓ ఎమోషనల్ సాంగ్ పాడబోతున్నాడు.
లియోన్ జేమ్స్ కంపోజిషన్‌లో ఆర్పీ పట్నాయక్ పాట ఉండబోతుందని తెలియజేస్తూ.. ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు విశ్వక్ సేన్. సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయిందని తెలియజేశాడు. ధమ్కీ ఫిబ్రవరి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ధమ్ కీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!
Read Also :Dil Raju | జూనియర్ ఎన్టీఆర్‌తో వన్స్‌మోర్.. దిల్ రాజు క్లారిటీ