టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 (NTR 30)చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ కానుంది. కాగా తారక్‌కు సంబంధించిన కొత్త ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)తో సినిమా చేయబోతున్నట్టు అప్డేట్ నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఓ చిట్ చాట్‌లో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌పై క్లారిటీ ఇస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌కు, నాకు మధ్య మంచి అవగాహన ఉంది. మేము ముగ్గురు దర్శకులను కలిసి.. వారి కథలను విన్నాం. ఈ మూడింటిలో నుంచి ఒకటి ఎంపిక చేసుకుని సినిమా చేస్తాం. త్వరలోనే మా కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఆశిస్తున్నానని చిట్‌చాట్‌లో చెప్పారు దిల్ రాజు. ఈ ఒక్క కామెంట్‌తో ఇక త్వరలోనే తారక్-దిల్ రాజు కలయికలో మరో సినిమా రాబోతుందని అర్థమవుతుంది. మరి ఈ ఇద్దరు ఎలాంటి కథతో ఈ సారి ప్రేక్షకుల ముందుకొస్తారనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే దిల్ రాజు-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో బృందావనం, రామయ్యా వస్తావయ్యా సినిమాలు వచ్చాయి. దిల్ రాజు ప్రస్తుతం విజయ్‌తో వారిసు సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు రాంచరణ్-శంకర్ కాంబినేషన్లో ఆర్సీ 15 మూవీని కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది.
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!
Read Also : Dhamki | ధమ్కీలో ఆర్పీ పట్నాయక్ పాట.. విశ్వక్సేన్ అప్డేట్