Tabraiz Shamsi : దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌కే ప్రాధాన్యమిస్తున్న స్పిన్నర్ తబ్రేజ్ షంసీ (Tabraiz Shamsi)కి ఊరట లభించింది. స్వదేశంలో జరుగుతున్న ఎస్ఏ20లో ఆడకుండా ఇతర దేశాల లీగ్స్‌లో ఆడుతున్న అతడికి అనుకూలంగా హై కోర్టు తీర్పునిచ్చింది. షంసీకి సత్వరమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్‌కు హైకోర్టు సూచించింది. అంతేకాదు ఐఎల్టీ20 సీజన్ పూర్తిగా అతడిని ఆడనివ్వాలని సఫారీ బోర్డును కోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే.. పొట్టి ఫార్మాట్లో ప్రమాదకరమైన షంసీకి ఫుల్ డిమాండ్ ఉంది. స్వదేశంలో జరుగుతున్న ఎస్ఏ20 నాలుగో సీజన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు అతడిని రూ.5 లక్షలకు కొన్నది. అయితే.. వ్యక్తిగత కారణాలతో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ ఆ ఫ్రాంఐజీతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు. తద్వారా ఎంఐ కేప్‌టౌన్‌తో కుదుర్చుకున్న వేలం ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడు. అయినా ఫ్రాంచైజీ అతడిని ఏమీ అనలేదు.
Tabraiz Shamsi took CSA to High Court because they didn’t give an NOC for the full period of the ILT20
The original NOC was only valid until 19 December
The court ruled in Shamsi’s favour and CSA had to extend the NOC to the full tournament and make out a 2nd one for the BBL pic.twitter.com/OUsU1jzHQb
— Werner (@Werries_) December 28, 2025
అనంతరం షంసీ.. ఐఎల్టీ20లోని గల్ఫ్ జెయింట్స్ (Gulf Giants) జట్టుతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ,.. ఎంఐ కేప్‌టౌన్ అతడికి డిసెంబర్ 19 వరకే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతో.. టోర్నీ మధ్యలో తనకు ఇబ్బందులు రాకుండా మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వాలని షంసీ కోర్టును ఆశ్రయించాడు. దాంతో.. ఆదివారం విచారణ చేపట్టిన హై కోర్టు షంసీకి జనవరి 4వ తేదీవరకూ ఎన్ఓసీ ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్‌కు సూచించింది. అంతేకాదు అతడికి న్యాయపరమైన ఖర్చులు కూడా బోర్డే చెల్లించాలని తెలిపింది. దాంతో.. షంసీ ఐఎల్20 ముగిశాక జనవరిలో బిగ్‌బాష్ లీగ్‌లో ఆడనున్నాడు. తన పరిస్థితిని అర్ధం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందుకు హై కోర్టుకు షంసీ ధన్యవాదాలు తెలిపాడు.