Barabar Premistha | రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ (ChandraHass). కాగా ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. చంద్రహాస్ నటిస్తోన్న కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ లాంచ్ చేశాడు.
తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు టీజర్ చెబుతోంది. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తుండగా.. అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.
A Gripping Love Story Set Against The Backdrop Of A Tense Rivalry Between Two Villages
Dynamic Director #VVVinayak Unveiled The teaser of Attitude Star #ChandraHass ‘s Love & Family Entertainer #BarabarPremisthahttps://t.co/hpWXJPtVGd pic.twitter.com/wApbgfB9TE
— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2024
KTR | మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది: కేటీఆర్
Keerthy Suresh | తగ్గేదే లే.. బేబిజాన్ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో కీర్తిసురేశ్