Vrushakarma | తండేల్ తర్వాత అక్కినేని నాగచైతన్య కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ (Vrushakarma) . ఈ మూవీకి విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్కీ భాస్కర్ ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది..
2026 డిసెంబర్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. వృషకర్మ శాటిలైట్రైట్స్ను పాపులర్ టీవీ ఛానల్ జీ తెలుగు దక్కించుకున్నట్టు సమాచారం. జీ తెలుగు భారీ మొత్తానికి వృషకర్మ శాటిలైట్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారట మేకర్స్.
వృషకర్మ లో ‘లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనుండటంతో.. ఇంతకీ క్రేజీ యాక్టర్‌ను డైరెక్టర్ కార్తీక్ దండు ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బి.లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు