Ravi Teja | టాలీవుడ్ యాక్ట్రర్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్లో చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రవితేజ ఈ మూవీ విడుదల కాకముందే శివనిర్వాణ డైరెక్షన్లో థ్రిల్లర్ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు రవితేజ పలువురు డైరెక్టర్లతో కథా చర్చల్లో కూడా ఉన్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా మరో క్రేజీ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఇటీవలే టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రవితేజకు ఓ హార్రర్ స్క్రిప్ట్‌ను చెప్పాడట. కథ ఇంప్రెస్ చేయడంతో రవితేజ పాజిటివ్‌గా స్పందించాడని ఇన్సైడ్ టాక్. కాగా వివేక్ ఆత్రేయ మరోవైపు ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కూడా ఓ కథ వినిపించాడని.. పలు కారణాల వల్ల ఈ కాంబో సెట్ కాకపోవడంతోనే రవితేజను లైన్లోకి తీసుకొచ్చాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సరిపోదా శనివారం తర్వాత వివేక్ ఆత్రేయ చేయబోయే కొత్త సినిమాపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి మరి.
థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న శివ నిర్వాణ-రవితేజ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.